గ్రామ సభల్లో ఎల్‌నినో ముప్పుపై అవగాహన

కలం, యాదగిరిగుట్ట: ఎల్‌నినో ప్రభావంతో భవిష్యత్తులో ఎదురయ్యే వాతావరణ పరిస్థితులను దృష్టిలో ఉంచుకొని యాదాద్రి భువనగిరి జిల్లాలో నీటి వనరుల సంరక్షణ, గ్రామీణ ఉపాధి కల్పనపై అవగాహన కల్పిస్తున్నారు. యాదగిరిగుట్ట మండలం మహబూబ్‌పేట (Mahabubpet) గ్రామసభలో అదనపు కలెక్టర్ ఏ. భాస్కర్‌రావు గురువారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రెండో పంట సాగు చేయకుండా నీటిని పొదుపుగా వినియోగించుకోవాలన్నారు. ఉపాధి హామీ పనులను గ్రామ అవసరాలకు అనుగుణంగా ఎంపిక చేసుకోవాలని సూచించారు.

వీబీజీ రాంజీ పథకంలో భాగంగా పని చేసే సామర్థ్యం ఉన్నవారికి 125 రోజుల పని కల్పించే అంశాన్ని భాస్కర్‌రావు వివరించారు. 175 పనుల జాబితా నుంచి మహబూబ్‌పేట (Mahabubpet) గ్రామానికి అవసరమైన పనులను ఎంపిక చేసుకోవాలని సూచించారు. నిబంధనలకు అనుగుణంగా 40 శాతం మెటీరియల్ కాంపోనెంట్‌తో అభివృద్ధి పనులు చేపట్టే అవకాశాన్ని గ్రామస్థులు సద్వినియోగం చేసుకోవాలని తెలిపారు.

ప్రజల భాగస్వామ్యం కీలకం..

గ్రామసభల్లో ప్రజల భాగస్వామ్యం కీలకమని, గ్రామానికి అవసరమైన పనులను గుర్తించి ప్రాధాన్యత క్రమంలో ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అదనపు కలెక్టర్ భాస్కర్ రావు సూచించారు. నీటి సంరక్షణ, గ్రామీణ మౌలిక సదుపాయాల అభివృద్ధి, ఉపాధి కల్పనకు ఉపయోగపడే పనుల ఎంపికలో అధికారులు సమన్వయంతో ముందుకు సాగాలని పేర్కొన్నారు.

ఈ కార్యక్రమంలో మండల ప్రత్యేక అధికారి పి. సునీల్‌కుమార్, తహసీల్దార్ గణేష్ నాయక్, ఎంపీడీవో కె. నవీన్‌కుమార్, మండల పంచాయతీ అధికారి ఇన్‌ఛార్జి ఇ.శ్రీనివాసరెడ్డి, మిషన్ భగీరథ ఏఈఈ జె.ప్రజ్ఞ, ఇరిగేషన్ ఏఈఈ జయ, ఏపీవో ఎల్. నరసయ్య, ఏపీఎం వెంకటేశ్వర్లు, పంచాయతీ కార్యదర్శి జె. రమేష్, గ్రామ సర్పంచ్ ఆరే. రమేష్ పాల్గొన్నారు.

Also Read : జపాన్ నుంచి వెనక్కి.. పారా స్విమ్మర్‌పై వేటు?

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>