కలం, స్పోర్ట్స్: భారత స్క్వాష్ రంగానికి గురువారం ఓ మరువలేని రోజుగా మిగిలిపోయింది. యువ సంచలనం అనాహత్ సింగ్ (Anahat Singh) షికాగో ఓపెన్‌లో అద్భుతం సృష్టించింది. టోర్నీ టాప్ సీడ్, ప్రపంచ దిగ్గజం నోర్ ఎల్ షెర్బినిని మట్టికరిపించి క్వార్టర్ ఫైనల్స్‌కు దూసుకెళ్లింది. ఇటీవల ఆసియా క్రీడలు 2026లో రజతం గెలిచిన అనాహత్, ఈ విజయంతో ప్రపంచ స్క్వాష్ రంగాన్ని తీవ్ర ఆశ్చర్యానికి గురిచేసింది. ప్రస్తుతం ప్రపంచ 15వ ర్యాంక్‌లో ఉన్న 18 ఏళ్ల అనాహత్, 3వ ర్యాంకర్ షెర్బినిపై ఆది నుంచి పూర్తి ఆధిపత్యం ప్రదర్శించింది. తన రోల్ మోడల్ అయిన షెర్బినిని 11-8, 11-8, 11-7 తేడాతో వరుస గేమ్‌లలో చిత్తు చేసింది.
కోర్టులో అద్భుతమైన వ్యూహంతో ఆడుతూ తప్పులను తగ్గించుకుంది. ప్రత్యర్థికి కోలుకునే అవకాశం ఇవ్వకుండా మ్యాచును ముగించింది. 2023లో ప్రొఫెషనల్ ప్లేయర్‌గా మారిన అనాహత్ (Anahat Singh), ఈ ఏడాది వరల్డ్ జూనియర్ ఛాంపియన్‌షిప్ టైటిల్ సాధించింది. అలాగే టాప్-20లోకి చేరిన అతిపిన్న వయస్కురాలైన ఆసియా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది. ఆమెకు భారత జాతీయ కోచ్‌తో పాటు ప్రసిద్ధ కోచ్ గ్రెగరీ గౌల్టియర్ శిక్షణ ఇస్తున్నారు.
ఈ మ్యాచ్‌లో కోచ్ ఇచ్చి నమ్మకం, సూచనలు తన గెలుపుకు ఎంతో ఉపయోగపడ్డాయని మ్యాచ్ అనంతరం అనాహత్ తెలిపింది. మరోవైపు ఈజిప్ట్ ప్లేయర్ షెర్బిని 265 వారాల పాటు ప్రపంచ నంబర్ 1గా నిలిచింది. ఆమె 8 సార్లు వరల్డ్ ఛాంపియన్‌గా, 4 సార్లు బ్రిటీష్ ఓపెన్ విజేతగా నిలిచింది. టోర్నీ ఫేవరెట్‌గా బరిలోకి దిగిన షెర్బినిపై గెలవడం తన వల్ల అవుతుందని అసలు ఊహించలేదని అనాహత్ ఆనందం వ్యక్తం చేసింది. తన గేమ్‌ప్లాన్ సరిగ్గా పనిచేయడంతోనే ఈ విజయం సాధ్యమైందని పేర్కొంది.
Also Read : జపాన్ నుంచి వెనక్కి.. పారా స్విమ్మర్‌పై వేటు?
Follow Us On: Youtube

