గుడిలోకి రానివ్వ‌ని వారిపై కేసు ఫైల్ చేయాలి: ఎమ్మెల్యే మేఘారెడ్డి

కలం, వనపర్తి: పెద్దమందడి మండలం మంగంపల్లి (Mangampally)లో ఆంజనేయస్వామి గుడిలోకి వెళ్లి వచ్చిన గ్రామ దళిత యువకుడు సుధీర్ పట్ల గ్రామంలోని కొందరు వ్యక్తులు దురుసుగా ప్రవర్తించిన తీరుపై ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి (Tudi Megha Reddy) ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ ఘ‌ట‌న‌పై ఆయ‌న బుధ‌వారం మీడియాతో మాట్లాడారు. సుధీర్ గుడిలోకి వెళ్లాడ‌న్న కార‌ణంతో అనవసరమైన మాటలు మాట్లాడిన వ్యక్తులపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేయాలని, తప్పు చేసిన వారిపై చర్యలు తీసుకోవాలని జిల్లా ఎస్పీకి ఎమ్మెల్యే విజ్ఞప్తి చేశారు. వనపర్తి నియోజకవర్గంలో, తన సొంత గ్రామం మంగంపల్లిలో అందరం ఎప్పుడూ క‌లిసే ఉంటామ‌ని, కొందరు వ్యక్తులు కావాలని ఈ విషయాన్ని రాజకీయం చేస్తున్నారని ఆయన ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

గత ప్రభుత్వ హయాంలో ఇక్కడున్న రాజకీయ నాయకులు ఒక్కసారైనా దళితుల ఇళ్ల‌ల్లో భోజనం చేసిన రోజు లేదని, తాను ఇప్పటికే ఎన్నో సార్లు భోజనం చేశానని ఎమ్మెల్యే తెలిపారు. తాము ఎప్పటికీ దళితులతో అన్నదమ్ములు, కుటుంబసభ్యులుగా కలిసి ఉంటామని ఆయన పేర్కొన్నారు. త‌న‌ సొంత గ్రామం మంగంపల్లికి చెందిన సుధీర్, కుటుంబ సభ్యులు సైతం తమతో కలిసిమెలిసి ఉంటారని, ఎలాంటి భేష‌జాలు లేకుండా అందరం కలిసి ఉంటామని, గ్రామంలో ఎలాంటి ఇబ్బందులు లేవ‌ని ఎమ్మెల్యే (Megha Reddy) స్ప‌ష్టం చేశారు.

Also Read : కేటీఆర్ హెయిర్ ప్లాంటేషన్‌పై బల్మూర్ వెంకట్ వ్యాఖ్యలు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>