‘బసంతి’ సహకారం.. మూడు అంగ‌న్‌వాడీల్లో వ‌స‌తులు

కలం, వనపర్తి: జిల్లాలోని మూడు గ్రామాల్లో అంగన్‌వాడీ కేంద్రాలను ఆధునిక సౌకర్యాలతో తీర్చిదిద్దుతున్న బసంతి ఫౌండేషన్‌ (Basanthi Foundation) సేవలు అభినందనీయమని కలెక్టర్‌ ఆదర్శ్‌ సురభి (Collector Adarsh Surabhi) అన్నారు. వనపర్తి మండలంలోని పెద్దగూడెం తండా, పెద్దగూడెం గ్రామాల్లో ఫౌండేషన్‌ ఆధ్వర్యంలో అభివృద్ధి చేస్తున్న అంగన్‌వాడీ కేంద్రాలను జిల్లా ఎస్పీ డి.సునీతారెడ్డి, ఫౌండేషన్‌ నిర్వాహకుడు అజయ్‌తో కలిసి శుక్రవారం ఆయన పరిశీలించారు. ప్రస్తుతం ఉన్న భవనాలకు మరమ్మతులు చేపట్టి, కొత్త కిటికీలు, తలుపులు, ఫ్లోరింగ్‌ టైల్స్‌, ఆధునిక వంటగది, ఫ్రిజ్‌, టీవీ, పిల్లలకు ఆట వస్తువులు, కిచెన్‌ గార్డెన్‌ తదితర సదుపాయాలు కల్పిస్తున్నట్లు అజయ్‌ వివరించారు.

ఈ రెండు కేంద్రాలతో పాటు మంగంపల్లి అంగన్‌వాడీ కేంద్రాన్ని కూడా ఆధునికీకరించనున్నట్లు తెలిపారు. అంగన్‌వాడీ కేంద్రాలను అన్ని హంగులతో ఆదర్శ కేంద్రాలుగా తీర్చిదిద్దాలని కలెక్టర్‌ సూచించారు. పిల్లల హాజరు శాతాన్ని రెట్టింపు చేసేలా అంగన్‌వాడీ టీచర్లు, గ్రామ సర్పంచులు ప్రత్యేక శ్రద్ధ తీసుకోవాలన్నారు. కార్యక్రమంలో జిల్లా సంక్షేమ అధికారి కె.సుధారాణి, ఎంపీడీవో, ప్రజాప్రతినిధులు తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>