గువ్వలదిన్నెలో ఫీల్డ్ అసిస్టెంట్‌పై అవినీతి ఆరోప‌ణ‌లు!

కలం, జోగులాంబ‌ గద్వాల: కే.టి.దొడ్డి మండలం గువ్వలదిన్నె (Guvvaladinne) గ్రామంలో VBG RAMG పథకం ఫీల్డ్ అసిస్టెంట్ పి. వీరన్న అక్రమాలకు, నిధుల దుర్వినియోగానికి పాల్పడుతున్నారని గ్రామస్తులు ఆరోపించారు. ఈ విషయమై వెంటనే విచారణ జరిపి సదరు ఫీల్డ్ అసిస్టెంట్‌పై కఠిన చర్యలు తీసుకోవాలని కోరుతూ గురువారం గ్రామస్తులు కే.టి.దొడ్డి ఎంపీడీఓ రమణరావుకు వినతిపత్రం సమర్పించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ఫీల్డ్ అసిస్టెంట్ వీరన్న ఫారం ఫండ్స్ లబ్ధిదారుల సంతకాలు తప్పుడు విధానంలో పెట్టి, మస్టర్లు నమోదు చేసి నిధులు కాజేశారని పేర్కొన్నారు. ​ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించిన డబ్బులు తీసుకొని వేరే ఫొటోలు ట్రాన్స్‌ఫర్ చేస్తున్నారని తెలిపారు.

పనికి వెళ్లే అసలైన కూలీల ఫొటోలు సమయానికి తీయకుండా, కూలీలు లేని చోట అనధికారికంగా డిమాండ్ పెట్టి నిధులు డ్రా చేస్తున్నారని ఆరోపించారు. కొత్త జాబ్ కార్డులు మంజూరు చేయడానికి ఒక్కొక్కరి నుంచి రూ.500 లంచం అడుగుతున్నారని, కొందరి దగ్గర ఇప్పటికే వసూలు చేశారని ఆరోపించారు. రైతులకు ముందస్తు సమాచారం ఇవ్వకుండానే ఎస్టిమేషన్లు వేసి, రైతులకు తెలియకుండానే పేమెంట్లు చేసుకుంటున్నారని వినతిపత్రంలో వివరంగా పేర్కొన్నారు. ఫీల్డ్ అసిస్టెంట్ అక్రమాలపై విచారణచేపట్టి చర్యలు తీసుకోవాలని గ్రామస్తులు డిమాండ్ చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>