వాల్మీకి ఎస్టీ సాధన సంకల్ప ర్యాలీ కర‌పత్రాల ఆవిష్క‌ర‌ణ‌

కలం, జోగులాంబ‌ గద్వాల: ఈనెల‌ 24న జోగులాంబ గద్వాల (Gadwal) జిల్లా కేంద్రంలో వాల్మీకి ఎస్టీ సాధన సంకల్ప ర్యాలీని నిర్వ‌హించ‌నున్నారు. ఈ ర్యాలీని నివిజయవంతం చేయాలని కోరుతూ గురువారం కే.టి.దొడ్డి మండలం వాల్మీకి సేవా సమితి, వాల్మీకి ఉద్యోగ సంఘం నాయకులు కర్ణాటక రాష్ట్రం దేవదుర్గ ఎమ్మెల్యే కర్రెమ్మ చేతుల మీదుగా క‌ర‌ప‌త్రాల‌ను ఆవిష్క‌రించారు. ఈ సందర్భంగా కే.టి.దొడ్డి మండల వాల్మీకి సేవా సమితి, ఉద్యోగ సంఘం నాయకులు ఎమ్మెల్యేను మర్యాదపూర్వకంగా కలిసి, గద్వాల‌లో జరిగే మహా ర్యాలీకి ముఖ్య అతిథిగా విచ్చేసి విజయవంతం చేయాలని కోరారు. దీనికి ఆమె సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>