విజయ డెయిరీ పాల ధరల పెంపు!

కలం, వెబ్ డెస్క్ : విజయ డెయిరీ వినియోగదారులకు షాక్ ఇచ్చింది. రేపటి నుంచి పాల ధరల (Vijaya Milk Price)ను పెంచుతున్నట్లు సంస్థ ప్రకటించింది. లీటరు, అర లీటరు ప్యాకెట్ల ధరలు మళ్లీ పెరిగాయి. రేపటి నుంచి ఈ కొత్త రేట్లు అమలులోకి రానున్నాయి. ముఖ్యంగా వినియోగదారులు ఎక్కువగా కొనుగోలు చేసే స్టాండర్డైజ్డ్ మిల్క్, హోల్ మిల్క్ అర లీటరు ప్యాకెట్లపై ఒక్కో రూపాయి చొప్పున పెంపు నిర్ణయించారు.

దీనితో రూ.34గా ఉన్న 500 ఎంఎల్ స్టాండర్డైజ్డ్ మిల్క్ ధర రూ.35కి చేరగా, రూ.39 ఉన్న 500 ఎంఎల్ హోల్ మిల్క్ ప్యాకెట్ ధర రూ.40కి పెరిగింది. ఈ రెండు రకాల పాల ధరల పెంపు అక్టోబర్ 17 నుంచి వర్తిస్తుండటంతో వినియోగదారులపై అదనపు భారం పడనుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>