నేడే వెంకీ ‘ఆదర్శ కుటుంబం’ ట్రైలర్ రిలీజ్!

కలం, సినిమా : టాలీవుడ్ స్టార్ హీరో విక్టరీ వెంకటేశ్, మాటల మాంత్రికుడు త్రివిక్రమ్ కాంబినేషన్‌లో తెరకెక్కిన ‘ఆదర్శ కుటుంబం’(Aadarsha Kutumbam) మూవీ ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతోంది. ఈ సినిమా ట్రైలర్‌ను నేడు గ్రాండ్‌గా రిలీజ్ చేయనున్నట్లు మేకర్స్ ప్రకటించారు. ట్రైలర్ లాంచ్(Trailer Launch) ఈవెంట్‌ను హైదరాబాద్‌లోని సూరారం మల్లారెడ్డి విశ్వవిద్యాపీఠ్‌లో సాయంత్రం 5 గంటల నుంచి నిర్వహించనున్నారు.

హారిక అండ్ హాసిని క్రియేషన్స్ బ్యానర్ నిర్మిస్తున్న ఈ సినిమాలో శ్రీనిధి శెట్టి, నివేదా పేతురాజ్ హీరోయిన్స్‌గా నటిస్తున్నారు. టాలెంటెడ్ యాక్టర్ నారా రోహిత్ కీలక పాత్ర పోషిస్తుండగా.. స్టార్ మ్యూజిక్ డైరెక్టర్ థమన్ మ్యూజిక్ అందిస్తున్నారు. ఈ సినిమా నుండి ఇప్పటికే రిలీజ్ అయిన సాంగ్స్ నెట్టింట ఫుల్ ట్రెండ్ అవుతున్నాయి. అక్టోబర్ 30న ‘ఆదర్శ కుటుంబం’ మూవీ గ్రాండ్ రిలీజ్ కానుంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>