కలం, సినిమా: మ్యూజిక్ డైరెక్టర్ అనిరుధ్ రవిచందర్ (Anirudh Ravichander) పెళ్లి వార్తలతో ఫ్యాన్స్ ఫుల్ ఖుషీ అయిపోతుంటే ఒకరు మాత్రం చాలా బాధ పడుతున్నారని సోషల్ మీడియాలో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. అనిరుధ్, కావ్యా మారన్ త్వరలో పెళ్లి చేసుకోబోతున్నారన్న విషయం తెలిసిందే. ఇప్పటికే వీరి పెళ్లికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డ్స్ కూడా పంచేశారు. అయితే అనిరుధ్ మాజీ ప్రియురాలు జోనితా గాంధీ (Jonita Gandhi) ఈ పెళ్లి వార్తతో విషాదంలో మునిగిపోయినట్లు సోషల్ మీడియాలో రూమర్లు మొదలయ్యాయి. అనిరుధ్ గతంలో చాలా మంది హీరోయిన్లను డేట్ చేసినట్లు పుకార్లు వచ్చాయి. ఎవ్వరితో అధికారికంగా రిలేషన్షిప్లో ఉన్నట్లు ప్రకటించకున్నా.. కీర్తి సురేశ్, శృతి హాసన్, ఆండ్రియా.. ఇలా పలువురు సీనియర్ హీరోయిన్లు అనిరుధ్ గర్ల్ ఫ్రెండ్స్ లిస్ట్‌లో ఉన్నారు.
ఒకానొక సమయంలో నటి, సింగర్ జోనితా గాంధీతో అనిరుధ్‌తో సీరియస్ రిలేషన్లో ఉన్నట్లు వార్తలు వచ్చాయి. వీరిద్దరూ కలిసి వర్క్ కూడా చేయడం ఆ వార్తలకు మరింత బలం చేకూర్చింది. ఇక తాజాగా అనిరుధ్ పెళ్లి ఫిక్స్ కావడంతో జోనితా తీవ్ర విషాదంలో మునిగిపోయిందట. ఇన్‌స్టా గ్రామ్‌లో ఆమె తరచూ సాడ్ సాంగ్స్ స్టోరీలు పెట్టడంతో నెటిజన్లు దీనికి అనిరుధ్ పెళ్లే కారణమని చర్చించుకుంటున్నారు. ముఖ్యంగా జోనితా డ్యూడ్ సినిమాలోని విట్టు పోన వాసలిలే.. అనే సాడ్ లవ్ సాంగ్ పోస్ట్ చేయడం అందరి దృష్టిని ఆకర్షిస్తోంది. నిజంగానే జోనితా పోస్టులకు అనిరుధ్ పెళ్లికి సంబంధముందా? అని కొందరు అనుమానం వ్యక్తం చేస్తున్నారు.

