మల్లికార్జున ఖర్గేతో వెలిచాల రాజేందర్‌రావు భేటీ.. కరీంనగర్‌లో కాంగ్రెస్ బలోపేతంపై చర్చ

కలం, కరీంనగర్ బ్యూరో: కాంగ్రెస్ పార్టీ కరీంనగర్ అసెంబ్లీ నియోజకవర్గ ఇన్‌చార్జి వెలిచాల రాజేందర్‌రావు (Velichala Rajender Ra) ఢిల్లీలో బుధవారం ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేను, ఉత్తరప్రదేశ్ పీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్, సహురాన్‌పూర్ లోక్‌సభ సభ్యుడు ఇమ్రాన్ మసూద్‌ను మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి చేపడుతున్న కార్యక్రమాలు, ప్రజా సమస్యల పరిష్కారానికి చేస్తున్న కృషి, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ విజయానికి అనుసరిస్తున్న కార్యాచరణ గురించి మల్లికార్జున ఖర్గే‌కు రాజేందర్‌రావు వివరించారు.

కరీంనగర్ కార్పొరేషన్ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ విజయం కోసం క్షేత్రస్థాయిలో చేపట్టిన కార్యక్రమాలు, పార్టీ నాయకులు, కార్యకర్తలతో సమన్వయం చేసుకుంటూ నిర్వహించిన అంశాల గురించి ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేకు వివరించారు. అదేవిధంగా కరీంనగర్ నియోజకవర్గ పరిధిలో అత్యధిక సంఖ్యలో కాంగ్రెస్ పార్టీ అభ్యర్థులను సర్పంచులుగా గెలిపించేందుకు కృషి చేశానని తెలిపారు. రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లోనూ పార్టీ అభ్యర్థుల విజయమే లక్ష్యంగా క్షేత్రస్థాయిలో పార్టీని మరింత బలోపేతం చేస్తున్నామని పేర్కొన్నారు.

పార్టీ శ్రేణులకు నిరంతరం అందుబాటులో..

కరీంనగర్ నియోజకవర్గ పరిధిలోని ప్రజలకు, కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలకు ఎల్లప్పుడూ అందుబాటులో ఉంటూ వారి సమస్యల పరిష్కారానికి ప్రత్యేక ప్రాధాన్యం ఇస్తున్నామని రాజేందర్‌రావు తెలిపారు. ప్రజల సమస్యలను గుర్తించి సంబంధిత అధికారుల దృష్టికి తీసుకెళ్లడంతో పాటు, వాటి పరిష్కారానికి నిరంతరం కృషి చేస్తున్నామని వివరించారు.

ప్రభుత్వ పథకాలు అర్హులకు అందేలా చర్యలు..

రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి నాయకత్వంలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న సంక్షేమ, అభివృద్ధి పథకాలు అర్హులైన పేదలకు చేరేలా ప్రత్యేక చర్యలు తీసుకుంటున్నామని రాజేందర్‌రావు తెలిపారు. ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పిస్తూ, అర్హులైన ప్రతి ఒక్కరికీ పథకాల ప్రయోజనాలు అందేలా క్షేత్రస్థాయిలో పనిచేస్తున్నామని మల్లికార్జున ఖర్గేకు వివరించారు.

కరీంనగర్ నియోజకవర్గంలో కాంగ్రెస్ పార్టీని మరింత బలోపేతం చేయడం, ప్రజా సమస్యల పరిష్కారానికి ప్రాధాన్యం ఇవ్వడం, రాబోయే స్థానిక సంస్థల ఎన్నికల్లో పార్టీ అభ్యర్థుల విజయానికి సమష్టిగా కృషి చేయడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్నామని వెలిచాల రాజేందర్‌రావు పేర్కొన్నారు. ఇదే స్ఫూర్తితో కరీంనగర్ నియోజకవర్గంలో మరింత కష్టపడి పని చేస్తూ కాంగ్రెస్ పార్టీ ప్రతిష్టతతో పాటు రాబోయే ఎన్నికల్లో విజయం సాధించడమే లక్ష్యంగా పనిచేయాలని ఏఐసీసీ అధ్యక్షుడు అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే సూచనలు చేశారని రాజేందర్ రావు తెలిపారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>