వారణాసిలో పేలుడు.. కుప్పకూలిన రెండంతస్తుల భవనం

కలం, వెబ్ డెస్క్ : ఉత్తర ప్రదేశ్ లోని వారణాసిలో రెండంతస్తుల భవనం కుప్పకూలింది (Varanasi Building Collapse) . సారనాథ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని పైగంబర్ పూర్ లోని ఓ బిల్డింగ్ లో అక్రమంగా బాణాసంచా తయారీ యూనిట్ నడుస్తోంది. ఈ క్రమంలో అక్కడ నిల్వ ఉంచిన పేలుడు పదార్థాల కారణంగా ప్రమాదం సంభవించింది. ఘటనలో బిల్డింగ్ పూర్తిగా ధ్వంసమయింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక సిబ్బంది, SDRF, NDRF, పారామెడికల్ బృందాలు రంగంలోకి దిగి సహాయక చర్యలు చేపట్టాయి. శిథిలాల కింద చిక్కుకున్న వారిని వెలికి తీసేందుకు తీవ్రంగా కృషి చేస్తున్నారు. భవన శిథిలాల కింద మరికొంతమంది చిక్కుకుని ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>