జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ.. పోలీసు అధికారులను తొలగించాలి: కేవీపీఎస్

కలం, ​కరీంనగర్: రాజన్న సిరిసిల్ల జిల్లా గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్‌ఐ చుక్కల శ్రీకాంత్, డీఎస్పీ నాగేంద్రచారి జర్నలిస్టులపై థర్డ్ డిగ్రీ ప్రయోగించడాన్ని కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం (KVPS) జిల్లా కార్యదర్శి తిప్పారపు సురేష్ తీవ్రంగా ఖండించారు. పోలీసుల దాడిలో గాయపడి కరీంనగర్ ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కొత్తూరు శేఖర్, సంపత్ రాతిపల్లిలను గురువారం  తెలంగాణ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు కూతాడీ శివరాజ్, PDSU జిల్లా కార్యదర్శి అంగడి కుమార్‌, తెలంగాణ రక్షణ సేన నాయకులతో కలిసి ఆయన పరామర్శించారు.

​ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ… ప్రజా సమస్యలను వెలుగులోకి తెచ్చే జర్నలిస్టులపై పోలీసులే చిత్రహింసలకు పాల్పడటం ప్రజాస్వామ్య విలువలకు, పత్రికా స్వేచ్ఛకు విరుద్ధమన్నారు. కస్టడీలో ఉన్న వ్యక్తులను హింసించడం రాజ్యాంగబద్ధమైన హక్కుల ఉల్లంఘనేనని ఆగ్రహం వ్యక్తం చేశారు. డీఎస్పీ నాగేంద్ర చారి, ఎస్‌ఐ శ్రీకాంత్‌లపై స్వతంత్ర, నిష్పాక్షిక విచారణ జరిపి, ఆరోపణలు రుజువైతే విధుల నుంచి తొలగించి కఠిన చర్యలు తీసుకోవాలని అన్నారు.

ఈ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు, పోలీస్ స్టేషన్ రికార్డులు, వైద్య నివేదికలను భద్రపరచా లని, బాధిత జర్నలిస్టులకు మెరుగైన వైద్య చికిత్స అందించడంతో పాటు, వారి కుటుంబాలకు తగిన భద్రత కల్పించాలని డిమాండ్ చేశారు. ​జర్నలిస్టులకు న్యాయం జరిగే వరకు తమ సంఘాల తరఫున పోరాటం కొనసాగిస్తామని నాయకులు స్పష్టం చేశారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>