రాహుల్ గాంధీపై సీజేఐ సూర్యకాంత్ ఆగ్రహం

కలం, వెబ్ డెస్క్: లోక్‌సభలో ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీపై సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ (CJI Surya Kant) ఆగ్రహం వ్యక్తం చేశారు. రాహుల్ గాంధీ ఇటీవల సుప్రీం కోర్టుకు చేసిన పాదయాత్రపై అభ్యంతరం చెబుతూ ఒక పిల్ దాఖలైంది. దీనిపై విచారణ జరిపిన సీజేఐ జస్టిస్ సూర్యకాంత్ మాట్లాడుతూ..’సుప్రీం కోర్టును ఎవరూ భయపెట్టలేరు. అలాంటి ప్రయత్నాలు చేయడం కూడా వృథా. మేం కల్పిత ప్రపంచంలో నివసించడం లేదు. కోర్టు లోపల, బయట ఏం జరుగుతుందో మాకు పూర్తిగా తెలుసు. సుప్రీం కోర్టుపై ఒత్తిడి తెచ్చే ప్రయత్నం చేశారు. ఇలాంటి ప్రయత్నాలను ఎవరూ పట్టించుకోరు. తన ప్రవర్తనపై పిటిషనర్ సంజాయిషీ ఇవ్వాల్సి ఉంటుంది’ అని స్పష్టం చేశారు.

ఇద్దరికి నోటీసులు జారీ..

సీజేఐ సూర్యకాంత్ (CJI Surya Kant) రాహుల్ గాంధీ పేరును నేరుగా ప్రస్తావించకుండా ఈ వ్యాఖ్యలు చేశారు. దీనిపై వివరణ ఇవ్వాలని రాహుల్ గాంధీ, అఖిలేష్ యాదవ్‌కు నోటీసులు జారీ చేశారు. కేంద్ర ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (CEC Gyanesh Kumar) రాజీనామా, సర్ ప్రక్రియపై అభ్యంతరం వ్యక్తం చేస్తూ సుప్రీం కోర్టులో పిటిషన్ వేసేందుకు రాహుల్ గాంధీ (Rahul Gandhi) రెండు రోజుల కిందట భారీ పాదయాత్ర నిర్వహించడం చర్చనీయాంశంగా మారింది. అంతకుముందు సీజేఐని స్వయంగా కలిసి ఈ పిటిషన్ సమర్పించాలని భావించినా.. వారి వినతిని సూర్యకాంత్ తిరస్కరించారు.

Also Read : మహిళల అభివృద్ధితో వికసిత్ భారత్: సీఎం చంద్రబాబు

Follow Us On: Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>