సెలెక్టర్ల స్పష్టతపై ఉమేష్ యాదవ్ ఫైర్!

కలం, స్పోర్ట్స్: భారత ఫాస్ట్ బౌలర్ ఉమేష్ యాదవ్ (Umesh Yadav) సెలెక్టర్ల వైఖరిపై , తన పునరాగమనంపై సంచలన వ్యాఖ్యలు చేశారు. ఆటగాళ్ల ఎంపికలో వయసును కాకుండా, కేవలం ప్రదర్శన , ఫిట్‌నెస్‌ను మాత్రమే ప్రామాణికంగా తీసుకోవాలని ఆయన వ్యాఖ్యానించారు. ఉమేష్ యాదవ్ 2008 నుండి 18 సంవత్సరాల పాటు విదర్భ జట్టుకు ప్రాతినిధ్యం వహించారు. అయితే 2026-27 దేశవాళీ సీజన్‌కు ముందు ఆయన విదర్భను వీడి పంజాబ్ జట్టులోకి మారారు. గాయం నుంచి కోలుకున్న తర్వాత విదర్భ యాజమాన్యం నుంచి తనకు సరైన మద్దతు లభించలేదని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. తనను జట్టు నుంచి తప్పించడమే లక్ష్యంగా అక్కడి కోచ్ వ్యవహరించారని ఆయన ఆరోపించారు.

2023లో చివరిసారిగా టీమిండియా తరఫున టెస్టు మ్యాచ్ ఆడిన ఉమేష్, తీవ్రమైన గాయాల వల్ల జట్టుకు దూరమయ్యారు. మొహమ్మద్ షమీకి బెంగాల్ క్రికెట్ అసోసియేషన్ మద్దతు ఇచ్చినట్లుగా, తనకు విదర్భ నుంచి సహకారం అందలేదని తెలిపారు. 38 ఏళ్ల వయసులో కూడా తాను పూర్తి ఫిట్‌నెస్‌తో ఉన్నానని, టీమిండియాలోకి రీఎంట్రీ ఇచ్చేందుకు సిద్ధంగా ఉన్నానని ఉమేష్ స్పష్టం చేశారు.సెలెక్టర్లు తమ నిర్ణయాలను ఆటగాళ్లకు నేరుగా, పారదర్శకంగా తెలియజేయాలని ఉమేష్ కోరారు. అస్పష్టమైన నిర్ణయాల వల్ల ఆటగాళ్లు అబద్ధపు ఆశలతో జీవించాల్సి వస్తుందని ఆయన అభిప్రాయపడ్డారు. విషయాలు స్పష్టంగా తెలిస్తే ఆటగాళ్ళు తమ భవిష్యత్తుపై సరైన నిర్ణయం తీసుకోగలుగుతారని ఆయన పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>