కలం, వెబ్ డెస్క్ : వెనిజులా (Venezuela) మీద ఈరోజు తెల్లవారు జాము నుంచే అమెరికా భీకర దాడులకు పాల్పడింది. వెనిజులా రాజధాని కరాకస్ లో అనేక చోట్ల అమెరికా సైన్యం దాడులు చేసింది. ఎయిర్ పోర్టులు, పోర్టులు, మౌలిక సదుపాయాలు, హాస్పిటళ్ల మీద మిస్సైళ్ల వర్షం కురిపించాయి అమెరికా బలగాలు. అమెరికా దాడులను వెనిజులా సైన్యం ఎదుర్కుంటోంది. వెనిజులా మీద యుద్ధాన్ని అధికారికంగా డొనాల్డ్ ట్రంప్ (Donald Trump) ప్రకటించారు.
వెనిజులాను లొంగదీసుకున్నామని.. ఆ దేశ అధ్యక్షుడు నికోలస్ మదురో (Nicolas Maduro) తమ ఆధీనంలోనే ఉన్నాడని అమెరికా క్ష్మిద్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ స్పష్టం చేశారు. మదురోతో పాటు ఆయన భార్యను అమెరికా తీసుకువస్తున్నట్టు తెలిపారు. డ్రగ్స్ అక్రమ రవాణా విషయంలో అమెరికా కొన్ని రోజులుగా వెనిజులాకు చెందిన బోట్లపై దాడులు చేస్తోంది. ఈ రోజు తెల్లవారు జామున మొదటిసారి వెనిజులాపై అధికారిక యుద్ధానికి దిగింది అమెరికా. మరి వెనిజులా అధ్యక్షుడితో ట్రంప్ ఏమైనా చర్చలు జరుపుతారా లేదా అన్నది చూడాలి. కాగా వెనిజులాలో ఉన్న ఖనిజ సంపద, ఆయిల్ కోసమే అమెరికా ఇలాంటి దాడులకు పాల్పడుతోందని వెనిజులా ఈ రోజు ఉదయం స్పందించింది.

Read Also: ప్రభాస్ తన మాట నిలబెట్టుకుంటాడా..?
Follow Us On: X(Twitter)


