తెలంగాణ ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపిన మహేష్ కుమార్ గౌడ్

కలం, నిజామాబాద్ బ్యూరో : తెలంగాణ రాష్ట్ర ప్రజలందరికీ టీపీసీసీ అధ్యక్షులు, ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ (Mahesh Kumar Goud) విజయదశమి పండుగ శుభాకాంక్షలు (Dasara Wishes) తెలిపారు. చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీకగా నిలిచే విజయదశమి పండుగ ప్రతి ఒక్కరి జీవితాల్లో నూతన వెలుగులు నింపాలని ఆకాంక్షించారు.

రాష్ట్ర ప్రజలందరూ సుఖసంతోషాలు, ఆయురారోగ్యాలు, సిరిసంపదలతో వర్ధిల్లాలని, ప్రతి కుటుంబంలో ఆనందం, శాంతి, సౌభాగ్యం వెల్లివిరియాలని ఆయన ఆకాంక్షించారు. దసరా పండుగ ప్రజల్లో ఐక్యత, సోదరభావం, సామాజిక సామరస్యాన్ని మరింత బలోపేతం చేయాలని పేర్కొన్నారు. తెలంగాణ రాష్ట్రం అభివృద్ధి పథంలో ముందుకు సాగాలని, ప్రజలందరికీ మంచి జరగాలని ఆకాంక్షిస్తూ రాష్ట్ర ప్రజలకు మరోసారి విజయదశమి శుభాకాంక్షలు తెలియజేశారు.

Also Read : కాంగ్రెస్ నేతలకు బీఆర్ఎస్ లీగల్ నోటీసులు

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>