కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్ మేడ్చల్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కండ్లకోయలో (Kandlakoya) ఆదివారం విషాద ఘటన చోటుచేసుకుంది. సీఎంఆర్ ఐటీ ఇంజినీరింగ్ కాలేజీలో బీటెక్ సెకండ్ ఇయర్ చదువుతున్న అక్షయ (19) హాస్టల్ గదిలో అనుమానాస్పద స్థితిలో మృతి చెందారు. శనివారం ఆమె గదిలో ఉండటాన్ని గమనించిన తోటి విద్యార్థులు.. హాస్టల్ నిర్వాహకులకు సమాచారం అందించారు. వారు పోలీసులకు సమాచారం అందించగా.. ఘటనాస్థలానికి పోలీసులు చేరుకున్నారు. పరిస్థితిని సమీక్షించి వివరాలు సేకరించి, మృతదేహాన్ని పోస్టుమార్టం కోసం గాంధీ ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యకు గల కారణాలపై లోతుగా దర్యాప్తు చేస్తున్నారు.
Also Read : సైబర్ దాడి.. స్తంభించిన TG-iPASS పోర్టల్!
Follow Us On : WhatsApp

