తెలంగాణ డీజీపీ ఆఫీస్‌లో ఆయుధ పూజ‌!

క‌లం, వెబ్‌డెస్క్: దసరా పండుగను పురస్కరించుకుని సోమవారం సాయంత్రం లక్డీకాపూల్‌లోని తెలంగాణ డీజీపీ ఆఫీసులో ఆయుధ పూజను నిర్వహించారు. రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ (DGP CV Anand) స్వయంగా ఈ పూజా కార్యక్రమంలో పాల్గొని విధుల్లో వినియోగించే ఆయుధాలు, ప్రత్యేక వాహనాలకు భక్తిశ్రద్ధలతో ప్రత్యేక పూజలు చేశారు. ఈ కార్యక్రమంలో డీజీ మహేష్ భగవత్, ఏఐజీ అడ్మిన్ రమణ కుమార్, స్టోర్స్ డీఎస్పీ, సీఎస్‌ఓ అధికారులతో పాటు పలువురు పోలీసు ఉన్నతాధికారులు, సిబ్బంది పెద్ద సంఖ్యలో హాజరయ్యారు.

ఈ సందర్భంగా డీజీపీ సీవీ ఆనంద్ మాట్లాడుతూ.. దైనందిన జీవితంలో మనం ఉపయోగించే పనిముట్లు, ఆయుధాలను గౌరవించాలని, వాటిని సరిగ్గా వినియోగిస్తే అన్ని రంగాలలో ఉత్తమ ఫలితాలు సాధించవచ్చని పేర్కొన్నారు. శాంతిభద్రతల పరిరక్షణలో నిరంతరం శ్రమిస్తున్న పోలీసు సిబ్బంది, వారి కుటుంబ సభ్యులు సుఖశాంతులతో, ఆయురారోగ్యాలతో వర్ధిల్లాలని ఆయన ఆకాంక్షించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>