epaper
Monday, March 2, 2026
epaper

హాకీ వరల్డ్ కప్‌లో భారత్ అద్భుత ఆరంభం

ఎఫ్ఐహెచ్ జూనియర్ హాకీ ప్రపంచకప్‌(Hockey World Cup)ను భారత్ అద్భుతంగా ప్రారంభించింది. ఆతిథ్యం ఇస్తూనే తొలి మ్యాచ్‌లోనే అదరగొట్టింది. చిలీతో జరిగిన తొలి మ్యాచ్‌లో రెండుసార్లు ఛాంపియన్ అయిన భారత్ అద్భుతంగా రాణించింది. 0-7 తేడాతో చిలీని చీల్చి చెండాడింది. భారత్ విజృంభించడంతో చిలీ ఏమాత్రం నిలవలేకపోయింది. మ్యాచ్ మొదలైన 16వ నిమిషంలో రోసన్ కుజుర్ భారత్ ఖాతాను తెరిచాడు. తొలి గోల్ అయిన మరో 5 నిమిషాల తర్వాత అంటే 21వ నిమిషంలో కుజుర్ మరో గోల్ చేశాడు. అనంతరం దిల్‌ రాజ్‌ వరుసగా 25, 34 నిమిషాల్లో గోల్స్‌ చేసి భారత్‌ జట్టుకు మరింత బలం అందించాడు. అజిత్‌ యాదవ్‌ (35’), అన్మోల్‌ ఎక్కా (48’), కెప్టెన్‌ రోహిత్‌ (60’) తలో గోల్‌ చేసి భారత్‌ ఘన విజయాన్ని ఖరారు చేశారు.

Hockey World Cup | మరోవైపు, డిఫెండింగ్‌ ఛాంపియన్‌ జర్మనీ కూడా టోర్నీలో విజయంతో బలమైన ఆరంభం చేసింది. ఏడుసార్లు ఛాంపియన్‌ జర్మనీ 4–0తో దక్షిణాఫ్రికాను చిత్తు చేసింది. జర్మనీ తరఫున జస్టస్‌ వార్వెగ్‌ 19, 56 నిమిషాల్లో ఫీల్డ్‌ గోల్స్‌ చేసి జట్టు విజయంలో కీలక పాత్ర పోషించాడు. బెన్‌ హాస్బాక్‌ (43’), పాల్‌ గ్లాండర్‌ (44’) తలో గోల్‌ చేశారు. రసవత్తరంగా సాగిన మరో మ్యాచ్‌లో ఐర్లాండ్‌ 4–3తో కెనడాను ఓడించింది. ఐర్లాండ్‌ తరఫున లూయిస్‌ రో (13’, 33’), గ్రెగరీ (35’), మిలో థాంప్సన్‌ (43’) గోల్స్‌ కొట్టారు. కెనడా జట్టు తరఫున గుర్నూర్‌ (26’), లీటన్‌ (48’, 53’) గోల్స్‌ చేసినా ఐర్లాండ్‌ ఆధిక్యాన్ని నిలబెట్టుకుంది.

Read Also: బీఆర్ఎస్ బలహీనమవుతోందా?

Follow Us On : Youtube

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>
error: Content is protected !!