కలం, వెబ్ డెస్క్: వరంగల్ జిల్లా నెక్కొండ రైల్వే స్టేషన్ (Nekkonda Railway Station) లో ఓ వ్యక్తి విద్యుత్ లైన్ పోల్ పైకి ఎక్కి హల్చల్ సృష్టించాడు. వివరాల్లోకి వెళితే.. సదరు వ్యక్తి భార్య తనతో మాట్లాడకుండా దూరం పెట్టినట్లు ఆరోపించాడు. దీంతో తీవ్ర మనస్తాపానికి గురైన అతను, రైల్వే విద్యుత్ పోల్ పైకి ఎక్కాడు. తన భార్య వచ్చి తనతో మాట్లాడాలని, లేదంటే పైనుంచి దూకి ఆత్మహత్య చేసుకుంటానని పెద్దగా కేకలు వేస్తూ బెదిరించాడు.
సమాచారం అందుకున్న నెక్కొండ పోలీసులు వెంటనే ఘటనా స్థలానికి చేరుకుని, విద్యుత్ పోల్ పైనున్న వ్యక్తికి నచ్చజెప్పి సురక్షితంగా కిందికు దించారు. అనంతరం సదరు వ్యక్తిని పోలీస్ స్టేషన్కు తరలించారు.

