కలం, స్పోర్ట్స్: వెస్టిండీస్‌తో నాలుగో టీ20లో టీమిండియా ఆటతీరుపై భారత మాజీ కెప్టెన్ సునీల్ గవాస్కర్ (Sunil Gavaskar) తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశాడు. అయితే, ఆయన విమర్శలు టీమిండియా ఆటతీరుపై కాకుండా.. గాయపడిన అర్ష్‌దీప్ సింగ్‌పై వెస్టిండీస్ పేసర్ షమర్ జోసెఫ్ బౌలింగ్ చేసిన తీరుపై ఉన్నాయి. భారత ఇన్నింగ్స్ చివర్లో అర్ష్‌దీప్ సింగ్‌కు షమర్ జోసెఫ్ వేసిన బౌన్సర్ భుజానికి తగిలింది. నొప్పితో ఇబ్బంది పడుతున్నా అర్ష్‌దీప్ బ్యాటింగ్ కొనసాగించాడు. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ మైదానం వీడాలని సూచించినా అతడు క్రీజులోనే ఉన్నాడు.
ఆ తర్వాత కూడా జోసెఫ్ మరో షార్ట్ బాల్ వేశాడు. ఈసారి బంతి అర్ష్‌దీప్‌కు తగలకుండా వెళ్లింది. నాలుగు బైస్, ఒక వైడ్ వచ్చాయి. నొప్పి కారణంగా అర్ష్‌దీప్ చివరకు రిటైర్డ్ హర్ట్‌గా వెనుదిరిగాడు. ఈ ఘటనపై కామెంటరీలో ఉన్న గవాస్కర్ తీవ్రంగా స్పందించాడు. వికెట్లు ఖాళీగా ఉన్నప్పుడు బ్యాటర్‌ను లక్ష్యంగా చేసుకుని బౌలింగ్ చేయడాన్ని తప్పుబట్టాడు. జోసెఫ్ బంతిని వికెట్ల వైపు వేయకుండా అర్ష్‌దీప్‌ను లక్ష్యంగా చేసుకున్నాడని విమర్శించాడు.

