కలం, వెబ్ డెస్క్ : అమెరికాలోని ఇల్లినాయిస్లోని పాలటైన్లో ఒక హిందూ దేవాలయం (America Hindu Temple) లో కాల్పుల కుట్రపై భారత ప్రభుత్వం తీవ్రంగా స్పందించింది. ఈ మేరకు విదేశాంగ శాఖ ప్రకటన జారీ చేసింది. హిందూ ఆలయంపై దాడి కుట్రలో హిందూ వ్యతిరేక, జాత్యహంకార స్వభావం ఉండటం, అలాగే భారతీయ సంతతికి చెందిన ప్రజలపై హింసకు సంబంధించిన ప్రస్తావనలు ఉండటం కలవరపెడుతోంది అని ఆందోళన వ్యక్తం చేసింది. అమెరికాలో జాత్యాహంకారం, భారత్ పై ద్వేషం పెరుగుతోందని విదేశాంగ అధికార ప్రతినిధి రణధీర్ జైశ్వాల్ పేర్కొన్నారు. ఈ ఘటనపై అమెరికా అధికారులు లోతుగా విచారణ చేపట్టి చర్యలు తీసుకోవాలని ఆయన కోరారు.
కాగా, అమెరికాలోని ఇల్లినాయిస్ రాష్ట్రంలోని పాలటైన్ లోని బాలాజీ దేవాలయంపై అలెక్సాండ్రస్ పపోరాకిస్ (19) కుట్ర చేశాడు. కాల్పులకు తెగబడేందుకు ఆలయంలోని ప్రవేశించి కాల్పులకు తెగబడే ప్రయత్నం చేశాడు. అయితే, రైఫిల్ జామ్ కావడంతో అక్కడున్న సిబ్బంది పోలీసులను అలర్ట్ చేయడంతో భారీ ప్రమాదం తప్పింది. ఈ ఘటనతో ఆలయంలోని భక్తులు భారతీయులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.

