కలం, సోన్ : సోన్ మండల (Soan Mandal) కేంద్రంలోని ప్రభుత్వ బాలుర వసతి గృహాన్ని ఎంపీడీవో కట్కం రామకృష్ణ శనివారం తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వసతి గృహంలో విద్యార్థుల సంఖ్య, హాజరు శాతాన్ని పరిశీలించారు. వంటగది, విద్యార్థుల గదులను సందర్శించి వసతి గృహంలో అందుతున్న సౌకర్యాల గురించి హాస్టల్ సిబ్బందిని అడిగి తెలుసుకున్నారు.
విద్యార్థులకు నాణ్యమైన భోజనం అందించడంతో పాటు, ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం ఆహారం అందించాలని సిబ్బందికి సూచించారు. విద్యార్థుల సంక్షేమం, వసతి గృహం నిర్వహణపై ప్రత్యేక శ్రద్ధ వహించాలని పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హాస్టల్ వార్డెన్ రాథోడ్ అర్చన తదితరులు పాల్గొన్నారు.

