సీఈసీ జ్ఞానేశ్ కుమార్ దిష్టిబొమ్మ దహనం

కలం, నిర్మల్: కేంద్ర ఎన్నికల ప్రధాన కమిషనర్‌ (సీఈసీ) జ్ఞానేశ్ కుమార్ వెంటనే రాజీనామా (CEC Gyanesh Kumar Resignation) చేయాలని డిమాండ్‌ చేస్తూ సంయుక్త కిసాన్‌ మోర్చా(Samyukta Kisan Morcha), ప్రజా సంఘాల ఆధ్వర్యంలో శుక్రవారం నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఆర్డీవో కార్యాలయం ఎదుట ఆయన దిష్టిబొమ్మను దహనం చేశారు. ఈ సందర్భంగా తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి దుర్గం నూతన్‌ కుమార్‌, జిల్లా అధ్యక్షుడు డాకూర్‌ తిరుపతి, అఖిల భారత రైతు కూలీ సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షుడు జె. రాజు మాట్లాడుతూ.. కేంద్రంలోని మోదీ ప్రభుత్వం రైతులు, కార్మికులు, వ్యవసాయ కార్మికులకు వ్యతిరేకమైన విధానాలను అమలు చేస్తోందని విమర్శించారు.

తాజాగా ఓటు హక్కును కూడా ప్రజలకు దూరం చేసే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపించారు. నాలుగు, ఐదు దశాబ్దాలుగా ఓటు హక్కును వినియోగించుకుంటున్న ఓటర్ల పేర్లను సైతం చిన్నచిన్న పొరపాట్లను సాకుగా చూపి ఓటరు జాబితా నుంచి తొలగిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. మరణించిన వారి పేర్లను ఓటరు జాబితా నుంచి తొలగించడం సాధారణ ప్రక్రియేనని, అయితే ప్రత్యేక సమగ్ర ఓటరు జాబితా సవరణ (ఎస్‌ఐఆర్‌) పేరుతో బీజేపీ వ్యతిరేక ఓట్లను తొలగిస్తున్నారని ఆరోపించారు. ఎన్నికల ప్రక్రియపై ప్రజల్లో విశ్వాసం నిలబెట్టేందుకు సీఈసీ జ్ఞానేశ్‌ కుమార్‌ను వెంటనే ఆ పదవి నుంచి తప్పించాలని, ఆయన రాజీనామా చేయాలని నాయకులు డిమాండ్‌ చేశారు.

 

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>