సౌదీ అరేబియాపై మళ్లీ హౌతీల దాడి

కలం, వెబ్ డెస్క్: సౌదీ అరేబియా (Saudi Arabia)పై మరోసారి హౌతీలు దాడి చేశారు. రియాద్‌‌పైకి భారీ సంఖ్యలో డ్రోన్లు ప్రయోగించగా.. వాటిని విజయవంతంగా కూల్చేసినట్లు ఆర్మీ ప్రకటించింది. ఈశాన్య, దక్షిణ ప్రాంతాల్లోని పలు చోట్ల దాడులు కొనసాగుతూనే ఉన్నాయని వివరించింది. మరోవైపు, నజ్రాన్ ప్రాంతంలో హెలికాప్టర్ కూలిన ఘటనలో ఇద్దరు పైలట్లు మరణించారు. ఈ ప్రమాదానికి హౌతీలతో సంబంధం లేదని.. సాంకేతిక లోపాల కారణంగానే కూలిపోయినట్లు ఏవీయేషన్ విభాగం ప్రకటించింది. ఇటీవల రియాద్ ఎయిర్‌పోర్టుపై హౌతీలు దాడి చేయడంతో 13 మంది మరణించిన విషయం తెలిసిందే. దీనిలో హైదరాబాద్‌కు చెందిన యూసుఫ్ కూడా మరణించాడు.

మక్కా ఒప్పందం ఉత్తిదేనా..?

సౌదీ అరేబియాతో తుర్కియే, పాకిస్థాన్ చేసుకున్న మక్కా సైనిక ఒప్పందం ఉత్తిదేనని తేలిపోయింది. ఈ మూడు దేశాల్లో దేనిపై దాడి జరిగినా.. మిగిలిన రెండు స్పందించాలి. సౌదీపై హౌతీలు భీకర దాడులు చేస్తున్నా.. పాకిస్థాన్‌, తుర్కియే పెద్దగా స్పందించలేదు. పాకిస్థాన్ జోక్యం చేసుకుంటే తమ డ్రోన్లు ఇస్లామాబాద్‌పైకి వస్తాయని హౌతీలు హెచ్చరించడంతో భయపడిపోయింది. ఇక తుర్కియే కూడా ఈ అంశంపై ఎక్కడా పెదవి విప్పడం లేదు. తమది నాటో తరహా కూటమి అని గొప్పలు చెప్పుకున్న పాకిస్థాన్.. యుద్ధంలో మాత్రం వెనుకడుగు వేసిందని సోషల్ మీడియాలో మీమ్స్ పేలుతున్నాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>