నేడు సద్దుల బతుకమ్మ సంబురం.. రాష్ట్ర వ్యాప్తంగా పూల పండుగ

కలం, వెబ్ డెస్క్ : తెలంగాణలో అత్యంత వైభవంగా జరిగే బతుకమ్మ వేడుకలు నేటితో ముగియనున్నాయి. తొమ్మిది రోజుల పాటు తీరొక్క పువ్వులతో బతుకమ్మను పేర్చి ఆడి పాడిన సంబురాలకు ఈ రోజుతో తెరపడనుంది. ఆదివారం జరిగే సద్దుల బతుకమ్మ (Saddula Bathukamma) వేడుకలతో రాష్ట్ర వ్యాప్తంగా పండుగ వాతావరణం నెలకొంది. రంగురంగుల పూలతో అందంగా పేర్చిన బతుకమ్మలతో మహిళలు, ఆడపడుచులు వేడుకల్లో పాల్గొంటారు.

గునుగు, తంగేడు, బంతి, చామంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి, సంప్రదాయబద్దంగా పాటలు పాడుతూ ఆడిపాడనున్నారు. చెరువులు, కుంటలు, ప్రధాన కూడళ్ల వద్ద మహిళలు సంబురాలు నిర్వహించనున్నారు. అనంతరం బతుకమ్మను నిమజ్జనం చేసి గౌరమ్మకు వీడ్కోలు పలుకుతారు. సత్తుపిండి, పెరుగన్నం, మలీద ముద్దలు వంటి పలు రకాల సద్దులను (Saddula Bathukamma) బతుకమ్మకు నైవేద్యంగా సమర్పించి.. ఆడపడుచులు ప్రసాదంగా పంచుకుంటారు.

తెలంగాణ ఆడపడుచుల ఐక్యతకు, ప్రకృతిని ఆరాధించే పూల పండుగను రాష్ట్రవ్యాప్తంగా ప్రజలు భక్తిశ్రద్ధలతో, ఆనందోత్సాహాలతో నిర్వహించుకుంటారు. పల్లెల నుంచి పట్టణాల వరకు బతుకమ్మ పాటలు, కోలాటాలు, ఆటపాటలతో పండుగ వాతావరణం నెలకొంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>