కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లోని హయత్నగర్ (Hayathnagar)లో ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుది. ఈ ఘటనలో అన్నాచెల్లెళ్లు మరణించారు. పోలీసుల వివరాల ప్రకారం, అంబర్పేట్కు చెందిన రేఖ, నవీన్ బైక్పై వెళ్తున్నారు. చెల్లి రేఖను నవీన్ పెద్ద అంబర్పేట్లోని అమ్మమ్మ ఇంటికి తీసుకెళ్తున్నాడు. ఈ క్రమంలో వీరిని ఒక కారు వేగంగా వచ్చి ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో రేఖ, నవీన్ అక్కడికక్కడే మరణించగా.. మరో చిన్నారి తీవ్రంగా గాయపడింది. స్థానికులు వెంటనే స్పందించి ఆసుపత్రికి తరలించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. సీసీ కెమెరాల ఆధారంగా కారు డ్రైవర్ను అదుపులోకి తీసుకున్నారు. ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.

