పేదలందరికీ ఇందిరమ్మ ఇళ్లు దక్కేలా కృషి చేస్తా: ఎమ్మెల్యే హామీ

కలం, భైంసా : భైంసా మండలంలోని సిరాల గ్రామంలో రూ.10 లక్షల వ్యయంతో నిర్మించనున్న ఐకేపీ భవన నిర్మాణ పనులకు ముధోల్ ఎమ్మెల్యే పవార్ రామారావు పటేల్ (Pawar Rama Rao Patel ) భూమిపూజ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. నియోజకవర్గంలోని గ్రామాల అభివృద్ధికి ప్రాధాన్యమిస్తూ రోడ్లు, గృహ నిర్మాణం, సాగునీటి సౌకర్యాల కల్పనకు కృషి చేస్తున్నట్లు తెలిపారు.

భారీ వర్షాల కారణంగా సిరాల ప్రాజెక్టు కట్ట తెగిపోయిన సమయంలో తాను గ్రామానికి వచ్చానని, ఎమ్మెల్యేగా ఎన్నికైన అనంతరం మరమ్మతు పనులు పూర్తి చేయించామని గుర్తుచేశారు. గత పదేళ్లలో రోడ్ల నిర్మాణానికి తగిన ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో ప్రస్తుతం ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని పేర్కొన్నారు. హామ్‌ పథకం కింద నియోజకవర్గంలో తొలి దశలో 230 కిలోమీటర్ల మేర రోడ్ల నిర్మాణానికి నిధులు మంజూరయ్యాయని, పనులను త్వరలో పూర్తి చేస్తామని చెప్పారు. రాబోయే రెండేళ్లలో పెద్దఎత్తున రోడ్ల నిర్మాణ పనులు చేపట్టనున్నట్లు వెల్లడించారు.

గత పదేళ్లలో ఇళ్ల మంజూరు జరగకపోవడంతో ప్రతి గ్రామం నుంచి ఇందిరమ్మ ఇళ్ల కోసం పెద్ద సంఖ్యలో దరఖాస్తులు వస్తున్నాయని తెలిపారు. ప్రభుత్వం తొలి విడతలో 3,500 ఇళ్లను, రెండో విడతలో మరో 1,000 ఇళ్లను మంజూరు చేసిందని చెప్పారు. అయినప్పటికీ పేదలకు ఇళ్లు కల్పించేందుకు తనకు కేటాయించిన కోటా నుంచి ఇళ్లు మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>