కలం, వెబ్ డెస్క్ : అద్దె చెల్లింపు విషయంలో తలెత్తిన వివాదం (Rent Dispute) లో ఇద్దరు వ్యక్తులు యజమానిని కాల్చిచంపిన ఘటన బెంగళూరు (Bengaluru) లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. బెంళూరుకు చెందిన మంజునాథ్ (42) అనే న్యాయవాది నివాసంలో ఇద్దరు అద్దెకు ఉంటున్నారు. ఈ క్రమంలో సోమవారం అద్దె చెల్లించాలని మంజునాథ్ వారిని అడిగారు.
అద్దె చెల్లించకపోవడంతో వారి మధ్య గొడవ (Rent Dispute) జరిగింది. దీంతో నిందితులిద్దరూ యజమానిపై కాల్పులు జరిపారు. తల భాగంలో బుల్లెట్ తగలడంతో న్యాయవాది మరణించారని పోలీసులు వెల్లడించారు. హత్య అనంతరం నిందితులు అక్కడి నుంచి పరారయ్యారు. ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు దర్యాప్తు చేపట్టారు.

