కలం, కరీంనగర్: కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ కేంద్రంలోని పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో దసరా పండుగ వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయుధ పూజ, జమ్మి పూజ, వాహన పూజ కార్యక్రమాలు సంప్రదాయబద్ధంగా జరిగాయి. పోలీస్ కమిషనర్ గౌష్ ఆలం (Police Commissioner Gaush Alam) ఈ పూజా కార్యక్రమాల్లో పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు.
దసరా పర్వదినాన్ని పురస్కరించుకుని పోలీసు శాఖ ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ వేడుకలు (Dasara Celebrations) భక్తిశ్రద్ధలతో సాగాయి. ఆయుధాలు, పోలీసు వాహనాలకు పూజలు నిర్వహించి పండుగ సంప్రదాయాలను పాటించారు. ఈ సందర్భంగా కమిషనర్ గౌష్ ఆలం మాట్లాడుతూ ..కమిషనరేట్ పరిధిలోని ప్రజలకు దసరా శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలందరూ ఆయురారోగ్యాలతో, సుఖసంతోషాలతో జీవించాలని ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో అడిషనల్ డీసీపీ వెంకటరమణ, రిజర్వ్ ఇన్స్పెక్టర్లు జానీమియా, శ్రీధర్ రెడ్డి, కిరణ్ కుమార్‌తో పాటు పలువురు పోలీసు అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు. పండుగ సందర్భంగా పోలీస్ హెడ్‌క్వార్టర్స్‌లో సందడి నెలకొంది. అధికారులు, సిబ్బంది పరస్పరం దసరా శుభాకాంక్షలు తెలియజేసుకున్నారు.

