కలం, వలిగొండ: యాదాద్రి భువనగిరి జిల్లా వలిగొండ మండలం రెడ్లరేపాక గ్రామంలో విషాద ఘటన చోటుచేసుకుంది. తాటి చెట్టు ఎక్కిన గీత కార్మికుడు ( Toddy Tapper) ప్రమాదవశాత్తు కిందపడి ప్రాణాలు కోల్పోయాడు. గ్రామానికి చెందిన కొండం శంకరయ్య గౌడ్ శుక్రవారం ఉదయం కల్లు గీసేందుకు తాటి చెట్టు ఎక్కగా, అనుకోకుండా పైనుంచి కిందపడటంతో అక్కడికక్కడే మృతిచెందాడు. ఈ ఘటనతో గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి.
విషయం తెలుసుకున్న గీత కార్మిక సంఘం నాయకుడు మాద శంకర్ గౌడ్ మృతుడి కుటుంబానికి సానుభూతి తెలిపారు. ఈ సందర్భంగా మాద శంకర్ గౌడ్ మాట్లాడుతూ.. ప్రభుత్వం స్పందించి బాధిత కుటుంబాన్ని ఆర్థికంగా ఆదుకోవాలని కోరారు. కుటుంబానికి తగిన పరిహారం అందించి, వారి జీవనోపాధికి భరోసా కల్పించాలని విజ్ఞప్తి చేశారు.

