కలం, కరీంనగర్: ఇటీవల నియామకమైన ఇండియన్ రెడ్ క్రాస్ సొసైటీ (Red Cross Society) కరీంనగర్ జిల్లా కార్యవర్గ సభ్యులకు ప్రముఖులు సత్కరించారు. సామాజిక వేత్త, ప్రముఖ ఇంజనీరు కోల అన్నారెడ్డి, సాయినేని నరేంధర్ లను వేములవాడ మున్నూరు కాపు సత్రం వ్యవస్థాపకులు, రాష్ట్ర బీసీ సంఘం కన్వీనర్ కొండా దేవయ్య ఆధ్వర్యంలో శనివారం శాలువాతో సత్కరించారు. శ్రీ రాజరాజేశ్వరి స్వామి వారి ప్రతిమను జ్ఞాపికగా అందజేసి ఘనంగా సన్మానించారు. వారు మరెన్నో సామజిక కార్యక్రమాలతో ప్రజలకు సేవలందించాలని కోరారు. ఈ కార్యక్రమంలో శ్రీనివాస్, కర్నే రాజమౌళి పాలొన్నారు. సభ్యులకు సత్రం ఆర్గనైజింగ్ కార్యదర్శి చిలుక రమేష్ శుభాకాంక్షలు తెలియజేశారు.

