బంగల్‌పేట్ మహాలక్ష్మి ఆలయంలో ఘనంగా బోనాల ఉత్సవం

కలం, నిర్మల్ : నిర్మల్ (Nirmal)  జిల్లా కేంద్రంలోని పురాతన బంగల్‌పేట్ మహాలక్ష్మి ఆలయం ఆదివారం అమ్మవారి నామస్మరణతో మార్మోగింది. మున్సిపల్ ఉద్యోగులు, శ్రీ ధర్మశాస్త్ర వెల్ఫేర్ సొసైటీ, బాగులవాడ యూత్, కాలభైరవ చిట్టీ సభ్యులు బోనాలు సమర్పించి ప్రత్యేక పూజలు నిర్వహించారు. బోనాలతో ఊరేగింపుగా ఆలయానికి చేరుకున్న భక్తులు అమ్మవారికి నైవేద్యం సమర్పించి మొక్కులు చెల్లించుకున్నారు. ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని అమ్మవారిని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో మున్సిపల్ శానిటరీ ఇన్‌స్పెక్టర్ ప్రవీణ్ కుమార్, జవాన్లు శేఖర్, రమేష్, సురేందర్, రాజశేఖర్, కిషన్, నిఖిల్‌, శ్రీ ధర్మశాస్త్ర వెల్ఫేర్ సొసైటీ సభ్యులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>