గంభీరావుపేట ఎస్సై శ్రీకాంత్ సస్పెన్షన్

కలం, సిరిసిల్ల: గంభీరావుపేట పోలీస్ స్టేషన్ ఎస్సై సీహెచ్ శ్రీకాంత్‌ (SI Srikanth)ను సస్పెండ్ చేస్తూ మల్టీజోన్-1 ఐజీ, జోన్-3 రాజన్న డీఐజీ ఇన్‌చార్జ్ ఎస్. చంద్రశేఖర్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. నిబంధనల ఉల్లంఘన, విధుల్లో తీవ్రమైన నిర్లక్ష్యం, అదుపులోకి తీసుకున్న నిందితులపై భౌతిక దాడికి పాల్పడ్డారనే ఆరోపణల నేపథ్యంలో ఆయనను ఈ విధంగా సస్పెండ్ చేయడం జరిగింది. ప్రస్తుతం రాజన్న సిరిసిల్ల డీఏఆర్ హెడ్‌క్వార్టర్స్‌కు అటాచ్ చేయబడిన శ్రీకాంత్, ఈ సస్పెన్షన్ కాలంలో హెడ్‌క్వార్టర్స్ వదిలి వెళ్లరాదని, ముందస్తు అనుమతి తప్పనిసరి అని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>