ఎన్నిక‌ల్లో మ‌ద్యం, మాంసంపై ఎమ్మెల్యేల వ్యాఖ్య‌లు

కలం, మహబూబ్‌న‌గ‌ర్‌ బ్యూరో: ఏ ఎన్నికలైనా ఓటర్లను ప్రలోభ పెట్టడానికి మద్యం, మాంసం తప్పనిసరి అంటూ ఎమ్మెల్యేలే ఆసక్తికర వ్యాఖ్యలు చేయడం అందరిని ఆశ్చర్యపరిచింది. శనివారం మహబూబ్‌న‌గ‌ర్‌ (Mahabubnagar)లోని బృందావన్ గార్డెన్స్‌లో ఏర్పాటు చేసిన పట్టభద్రుల ఎమ్మెల్సీ ఎన్నికల (MLC Elections) సన్నాహ‌క‌ సమావేశంలో వనపర్తి, జడ్చర్ల, షాద్నగర్ ఎమ్మెల్యేలు ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఈ సమావేశానికి జిల్లా మంత్రులైన ఆబ్కారీ శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు , పశుసంవర్ధక శాఖ మంత్రి వాకిటి శ్రీహరి, నాగర్ కర్నూల్ ఎంపీ మల్లు రవి, ఎమ్మెల్సీ దామోదర్ రెడ్డిలతో పాటు జిల్లాలోని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలంతా హాజరయ్యారు. ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా హాజరైన కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలను ఉద్దేశించి ఎమ్మెల్యేలు మాట్లాడారు. ఈ సందర్భంగా వనపర్తి ఎమ్మెల్యే తూడి మేఘారెడ్డి మాట్లాడుతూ.. ఎన్నికలకు అవసరమైన మద్యం మన మంత్రి (జూపల్లి కృష్ణారావు) వద్ద ఉంటుందని, అలాగే మాంసం మన మంత్రి (వాకిటి శ్రీహరి) వద్దే ఉంటుందని.. అన్నీ మన వద్దే ఉన్నప్పుడు వేరే వాళ్లు ఎలా గెలుస్తారు అంటూ ఛ‌లోక్తులు విసిరారు.

దీనికి కొనసాగింపుగా జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్‌ రెడ్డి మాట్లాడుతూ.. మద్యం మాంసంతో పాటు అనారోగ్యానికి మన జిల్లా ఇన్‌చార్జ్‌ మంత్రి (వైద్య ఆరోగ్యశాఖ మంత్రి దామోదర రాజనర్సింహ) అందుబాటులో ఉంటారని తెలిపారు. ఎన్నికల్లో ఎలాగైనా గెలవాలని కృత నిక్షయంతో నేతలు ఉన్నారని, కాంగ్రెస్ కార్యకర్తలు భావిస్తున్నారు. షాద్‌న‌గర్ ఎమ్మెల్యే వీర్లపల్లి శంకర్ మాట్లాడుతూ కార్యకర్తల్లో కొంత అసంతృప్తి ఉన్న అందర్నీ సమన్వయంతో కలుపుకొని ఎమ్మెల్సీ ఎన్నికల్లో కాంగ్రెస్ జెండా ఎగురవేయాలంటూ పిలుపునిచ్చారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>