కలం, వెబ్ డెస్క్: తెలంగాణలో ఈ రోజు పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు (Rain Alert) పడే అవకాశం ఉందని వాతావరణ నిపుణులు సూచించారు. నాగర్ కర్నూల్, నల్లగొండ, ఖమ్మం, భద్రాద్రి కొత్తగూడెం, వనపర్తి, రంగారెడ్డి, యాదాద్రి భువనగిరి జిల్లాల్లోని కొన్ని ప్రాంతాల్లో రాత్రి వరకు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొన్నారు. సిద్ధిపేట, మెదక్, హనుమకొండ, వరంగల్, జనగామ, ములుగు, మంచిర్యాల, కుమురం బీం ఆసిఫాబాద్, రాజన్న సిరిసిల్ల, ఆదిలాబాద్, నిజామాబాద్, మహబూబ్ నగర్, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాల్లో సాధారణ వర్షాలు నమోదు కానున్నాయి. హైదరాబాద్ నగర పరిధిలో పెద్దగా వర్షాలు కురిసే అవకాశం లేదన్నారు.

