జపాన్ ఓపెన్ సెమీస్‌లోకి దూసుకెళ్లిన పీవీ సింధు!

కలం, స్పోర్ట్స్: భారత స్టార్ షట్లర్, రెండు సార్లు ఒలింపిక్ పతకాలు గెలిచిన పీవీ సింధు (PV Sindhu) జపాన్ ఓపెన్‌లో సరికొత్త మైలురాయిని అందుకుంది. శుక్రవారం జరగాల్సిన క్వార్టర్ ఫైనల్ మ్యాచ్‌కు ముందే ప్రత్యర్థి తప్పుకోవడంతో, సింధు నేరుగా సెమీఫైనల్‌కు దూసుకెళ్లింది.

దాదాపు మూడేళ్ల తర్వాత ఆమె ఒక సూపర్ 750 టోర్నమెంట్‌లో సెమీస్‌కు చేరడం ఇదే మొదటిసారి. ఈ టోర్నీలో క్వార్టర్స్ మ్యాచ్‌లో జపాన్‌కు చెందిన మాజీ ప్రపంచ ఛాంపియన్ నోజోమి ఒకుహారాతో సింధు తలపడాల్సి ఉంది.

సెమీస్ టికెట్ సులువుగానే..

ఒకుహారా మ్యాచ్ ఆడకుండానే వెనుదిరగడంతో సింధుకు సెమీస్ టికెట్ సులువుగా లభించింది. అంతకుముందు ప్రిక్్వార్టర్స్ మ్యాచ్‌లో దక్షిణ కొరియా క్రీడాకారిణి అన్ సే-యంగ్ కాలి గాయం కారణంగా తప్పుకోవడంతో ఒకుహారా కూడా ఇలాగే ముందుకు సాగడం గమనార్హం.

ఈ ఏడాది సింధుకు ఇది మూడో సెమీఫైనల్ కావడం విశేషం. ఇంతకుముందు ఆమె మలేషియా ఓపెన్, ఆస్ట్రేలియన్ ఓపెన్లలో కూడా సెమీస్ చేరి మంచి ప్రదర్శన కనబరిచింది.

చెన్ యుఫీతో ఇక పోరు..

ఇక శనివారం జరగబోయే సెమీఫైనల్ పోరులో టోక్యో ఒలింపిక్ ఛాంపియన్, చైనా స్టార్ క్రీడాకారిణి చెన్ యుఫీతో సింధు తలపడనుంది. క్వార్టర్ ఫైనల్లో దక్షిణ కొరియాకు చెందిన సిమ్ యు జిన్‌పై ఘన విజయం సాధించి చెన్ యుఫీ సెమీస్‌కు దూసుకొచ్చింది. ఇప్పటివరకు సింధు, చెన్ యుఫీ ఇద్దరూ 14 సార్లు తలపడగా, చైనా క్రీడాకారిణి 8-6 ఆధిక్యంలో ఉంది.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>