కలం, స్పోర్ట్స్: భారత పురుషుల క్రికెట్ ఎంపిక కమిటీలో కీలక మార్పులు జరిగాయి. సీనియర్ ఎంపిక కమిటీ కొత్త ఛైర్మన్‌గా మాజీ స్పిన్నర్ ప్రజ్ఞాన్ ఓజా (Pragyan Ojha) బాధ్యతలు చేపట్టారు. అజిత్ అగార్కర్ పదవీకాలం ముగియడంతో ఓజాకు ఈ బాధ్యతలు దక్కాయి. ఐదుగురు సభ్యుల ఈ కమిటీలోకి మాజీ క్రికెటర్ రమేష్ పవార్ కొత్తగా వచ్చారు. బీసీసీఐ హెడ్‌క్వార్టర్స్‌లో క్రికెట్ అడ్వైజరీ కమిటీ (సీఏసీ) సభ్యులు అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపే రమేష్ పవార్‌ను ఇంటర్వ్యూ చేశారు. ఆ తర్వాత ఆయన నియామకాన్ని ఏకగ్రీవంగా సిఫార్సు చేశారు. ఎక్కువ టెస్టులు ఆడిన అనుభవం ఆధారంగా ప్రజ్ఞాన్ ఓజా ఛైర్మన్ అయ్యారు.
టీమిండియా మాజీ ఫాస్ట్ బౌలర్ అజిత్ అగార్కర్ 2023 జులైలో ఛైర్మన్‌గా బాధ్యతలు తీసుకున్నారు. ఆయన పదవీకాలం 2026 అక్టోబర్ 4న పూర్తయింది. పొడిగింపునకు ఆయన ఇష్టపడలేదు. ఆయన నాయకత్వంలో భారత్ 2024, 2026 టి20 ప్రపంచకప్‌లు గెలిచింది. అలాగే 2025 ఛాంపియన్స్ ట్రోఫీ, రెండు ఆసియా కప్‌లు, ఆసియా క్రీడల స్వర్ణాలు సాధించింది. అగార్కర్ సేవలను బిసిసిఐ ప్రశంసించింది.
ప్రజ్ఞాన్ ఓజా సెప్టెంబర్ 2025లో ఈ కమిటీలోకి వచ్చారు. ఆయన భారత్ తరఫున 24 టెస్టులు, 18 వన్డేలు, 6 టి20లు ఆడారు. కొత్తగా చేరిన రమేష్ పవార్ 2 టెస్టులు, 31 వన్డేలు ఆడారు. పవార్ భారత మహిళల జట్టుకు, ముంబై, గుజరాత్ జట్లకు హెడ్ కోచ్‌గా కూడా పనిచేశారు. ప్రస్తుత ఎంపిక కమిటీలో ప్రజ్ఞాన్ ఓజా, శివ్ సుందర్ దాస్, ఆర్పీ సింగ్, అజయ్ రాత్రా, రమేష్ పవార్ ఉన్నారు.

