గాల్లోనే ఢీకొన్న రెండు విమానాలు.. నలుగురు పైలట్లు మృతి..!

కలం, వెబ్​ డెస్క్​: ఫిలిప్పీన్స్​ లో ఘోర విమాన ప్రమాదం చోటు చేసుకుంది. వైమానిక స్థావరంలో శిక్షణ పొందుతున్న రెండు సైనిక విమానాలు గాల్లోనే ఢీకొన్నాయి. (Philippines Military Plane Crash) ఈ ఘటనలో నలుగురు పైలట్లు మృతి చెందినట్లు ఆ దేశ వైమానిక దళం శనివారం ప్రకటించింది. మనీలాలోని ఫెర్నాండో వైమానిక స్థావరం పరిధిలో ఎస్ఎఫ్-260 సింగిల్ ప్రొపెల్లర్ విమానాలు కూలిపోయాయి.

శిక్షణ సమయంలో ఫిలిప్పీన్ వైమానిక దళ విమానాలు గాలిలో అత్యంత ప్రమాదకరంగా దగ్గరగా దూసుకెళ్లి ఢీకొన్నాయి. ఈ ప్రమాదానికి (Philippines Military Plane Crash) గల కారణాలపై అధికారులు దర్యాప్తు చేపట్టారు. ముందుజాగ్రత్త చర్యగా వైమానిక దళానికి చెందిన ఎస్ఎఫ్-260 విమానాలను తాత్కాలికంగా నిలిపివేసినట్లు అధికారులు వెల్లడించారు.

ఈ సంవత్సరంలోనే పిలిప్పీన్స్​ సైనిక విమానాలకు సంబంధించి అనేక ఘోర ప్రమాదాలు జరిగాయి. మే నెలలో ఫిలిప్పీన్స్‌లోని బెంగ్యూట్ ప్రావిన్స్‌లో శిక్షణ సమయంలో ఎస్ఎఫ్-260 విమానం కూలిపోవడంతో ఇద్దరు సైనిక పైలట్లు మరణించారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>