కలం, నిర్మల్ : మామడ మండలం పోతారం గ్రామంలో ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం ఆధ్వర్యంలో నిర్వహించనున్న శ్రీశ్రీశ్రీ పెద్ద భీమన్న స్వామి వారి జాతర (Pedda Bheemanna Jatara) మహోత్సవ ఆహ్వాన పత్రికను నిర్మల్ డిఎస్పీ శ్రీనివాస్, సోన్ సిఐ గోవర్ధన్ రెడ్డికి నాయకపోడ్ సేవా సంఘం నాయకులు సోమవారం అందజేశారు. ఈ సందర్భంగా సంఘ ప్రతినిధులు మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం సాంప్రదాయబద్ధంగా నిర్వహించే శ్రీశ్రీశ్రీ పెద్ద భీమన్న స్వామి జాతర ఈ నెల 21న బుధవారం నుండి 26 వరకు వైభవంగా జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర ఉపాధ్యక్షులు వెంకగారి భూమయ్య, జిల్లా ఉపాధ్యక్షులు సంచు శ్రీనివాస్, సత్యనారాయణ, రామకృష్ణ, పోతారం గ్రామ ఆదివాసి నాయకపోడ్ సేవా సంఘం ప్రతినిధులు పాల్గొన్నారు.

