కలం, స్పోర్ట్స్: భారత జూనియర్ సెలక్షన్ కమిటీ ఛైర్మన్‌గా మాజీ పేసర్ పర్విందర్ అవనా (Parvinder Awana) నియమితులయ్యారు. ఈ మేరకు అక్టోబర్ 23 శుక్రవారం బీసీసీఐ ప్రకటన విడుదల చేసింది. అశోక్ మల్హోత్రా, జతిన్ పరాంజపేలతో కూడిన క్రికెట్ అడ్వైజరీ కమిటీ (CAC) ఇంటర్వ్యూలు నిర్వహించి అవనా పేరును సిఫార్సు చేసింది. కమిటీలో కృష్ణ దాస్, రాకేష్ పటేల్, ఎన్. అర్జున్ యాదవ్‌లను సభ్యులుగా ఎంపిక చేశారు. ఐదో సభ్యుడిని త్వరలోనే నియమిస్తామని బోర్డు తెలిపింది. అవనా భారత్ తరఫున రెండు టీ20లు ఆడారు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 191 వికెట్లు తీశారు. ఢిల్లీ, ఐపీఎల్లో పంజాబ్ కింగ్స్ తరఫున రాణించారు.
రిటైర్మెంట్ తర్వాత ఢిల్లీ వయస్సు విభాగాలు, భారత్ అండర్-19 జట్లకు కోచ్‌గా వ్యవహరించారు. సభ్యుడైన కృష్ణ దాస్ ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లో 166 వికెట్లు తీసి, ఉత్తరాఖండ్ రంజీ జట్టుకు కోచ్‌గా పనిచేశారు. రాకేష్ పటేల్ గుజరాత్, బరోడా తరఫున ఆడి పలు జట్లకు శిక్షణ ఇచ్చారు. అర్జున్ యాదవ్ 2000 నాటి అండర్-19 ప్రపంచకప్ విజేత జట్టులో సభ్యుడు. హైదరాబాద్ తరఫున ఆడి, తరువాత మ్యాచ్ రిఫరీగా పనిచేశారు. ఈ కొత్త కమిటీ త్వరలోనే భారత జూనియర్ జట్ల ఎంపిక బాధ్యతలను స్వీకరించనుంది. బాధ్యతల నిర్వహణకు కమిటీ సర్వసన్నద్ధమవుతోంది.

