న్యూడుల్స్ తిని ఫ్యామిలీ డెత్‌.. వెలుగులోకి కీల‌క విష‌యాలు!

క‌లం, వెబ్‌డెస్క్‌: యూపీలోని నోయిడాలో న్యూడుల్స్ తిని ఓ ఫ్యామిలీ మృతి (Noida Family Deaths) చెందిన ఘ‌ట‌న సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారిన సంగ‌తి తెలిసిందే. రాత్రి న్యూడుల్స్ తిని తెల్ల‌వారే స‌రికి ఒకే కేటుంబానికి చెందిన ఐదుగురు మృతి చెందిన‌ట్లుగా ఆరోప‌ణ‌లు వ‌చ్చాయి. అయితే ఈ ఫ్యామిలీ మృతికి న్యూడుల్స్ కార‌ణం కాద‌ని పోలీసులు తేల్చారు. ఈ న్యూడుల్స్ కేసును విచారించిన పోలీసులు కీల‌క విష‌యాలు వెల్ల‌డించారు.

దంప‌తులు, వారి ముగ్గురు పిల్లల మృతికి కారణం నూడుల్స్ కాదని స్పష్టం చేశారు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న ఆస్తి వివాదం కారణంగా స‌ద‌రు కుటుంబం ఆత్మహత్య చేసుకుందని క్లారిటీ ఇచ్చారు. ఆత్మహత్యకు ముందు మృతుడు మహేశ్ తన ఫోన్‌లో రికార్డ్ చేసిన వాయిస్ నోట్‌తో ఈ విషయాన్ని గుర్తించిన‌ట్లు తెలిపారు. ఆస్తి కోసం ఇద్దరు అక్కాచెళ్లెల్లు, బావ తమ కుటుంబాన్ని కొన్నేళ్లుగా వేధిస్తున్నారని మహేశ్ పేర్కొన్నారు. వారి వేధింపులు తాళలేక తాము ఆత్మహత్య చేసుకుంటున్నట్టు వాయిస్ నోట్‌లో వెల్లడించారు. దీంతో ఇద్దరు సోదరీమణులు, బావపై కేసు నమోదు చేసిన పోలీసులు వారిని అదుపులోకి తీసుకున్నారు. అయితే ఈ కుటుంబం మొత్తం రాత్రి నూడుల్స్ తిన్న విష‌యం నిజ‌మేన‌ని, వీరంతా నూడుల్స్‌లో విషం కలుపుకొని తిని సూసైడ్‌కు పాల్పడి ఉంటారని పోలీసులు అనుమానిస్తున్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>