కవిత టీఆర్ఎస్ పార్టీపై జిల్లా నాయకుల నిశిత పరిశీలన

కలం, నిజామాబాద్ బ్యూరో: కవిత ప్రకటించిన టీఆర్ఎస్ (TRS) పార్టీపై ఆమె మెట్టినిల్లు అయిన నిజామాబాద్ (Nizamabad) జిల్లాలో నిశితంగా పరిశీలిస్తున్నారు. కవిత ప్రసంగాలు, మాటలు, హామీలను ఆయా పార్టీల నేతలు టీవీల్లో వీక్షించారు. ప్రధానంగా నిజామాబాద్ జిల్లాలో కవిత ఎంపీగా ఎమ్మెల్సీగా పని చేయడం వల్ల బీఆర్ఎస్ ప్రభుత్వం కూడా అప్పుడు ఉండటం వల్ల బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు కవిత పార్టీ ప్రారంభ కార్యకలాపాలపై ప్రత్యేక దృష్టి సారించారు. తండ్రి మాజీ సీఎం కేసీఆర్‌పై కవిత చేసిన వ్యాఖ్యలపై ఇప్పటివరకూ బీఆర్ఎస్ నేతలు, ఎమ్మెల్యేలు, మాజీ ఎమ్మెల్యేలు అయితే ఎవరూ స్పందించలేదు. అధిష్టానం ఆదేశాల కోసం ఎదురుచూస్తున్నట్లు కనిపిస్తోంది. అయితే కొందరు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు మాత్రం కవితకు మద్దతు తెలుపుతూ స్టేటస్‌లు పెట్టుకోవడం కనిపించింది. నిజామాబాద్‌లో బీఆర్ఎస్ మాజీ కార్పొరేటర్ పద్మశాలి సామాజిక వర్గ సంఘ నాయకుడు ఎనగందుల మురళీ కవితకు మద్దతు పలికారు. ఈ మేరకు స్టేటస్ పెట్టుకొన్నారు. సోషల్ మీడియాలో కవితకు బహిరంగ మద్దతు ప్రకటించారు. ఆయనతో పాటు జిల్లా వ్యాప్తంగా కూడా పలువురు బీఆర్ఎస్ ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కవితకు మద్దతు ప్రకటిస్తున్నారు.

ఇంకొందరు బహిరంగంగా కాకపోయినా అంతర్గతంగా మద్దుతునిస్తూ సరైన సమయం కోసం వేచి చూస్తున్నట్టు చెబుతున్నారని మురళీ లాంటి నేతలు అంటున్నారు. మరోవైపు కవిత త్వరలోనే నిజామాబాద్ లో పార్టీ సమావేశం నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. 25న పార్టీ పేరు ప్రకటిస్తున్నట్టు నిజామాబాద్‌లో శ్రీరామ నవమి నాడు నిజామాబాద్‌లోనే ప్రకటించారు. అలాగే పార్టీ సమావేశం కూడా నిజామాబాద్‌కే ప్రాధాన్యం ఇస్తారని తెలుస్తోంది. ఇటు ఆర్మూర్‌లో ఒక న్యాయవాది కవిత పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. ఆర్మూర్, బోధన్, బాల్కొండ, నిజామాబాద్, ఎల్లారెడ్డి ఇలా చాలా నియోజక వర్గాలలో బీఆర్ఎస్‌తోపాటు ఇతర పార్టీల నుంచి పలువురు ద్వితీయ శ్రేణి నాయకులు కార్యకర్తలు కవిత పార్టీలోకి వచ్చేందుకు సిద్ధంగా ఉన్నట్టు సమాచారం. కవిత నిజామాబాద్‌లో సమావేశం ఏర్పాటు చేస్తే ఆ రోజు ఎవరెవరు అనేది తేటతెల్లం కానుంది. అయితే కవిత పార్టీ వైపు ఎవరెవరు వెళ్తారనే అంశం‌పై ఆయా రాజకీయ పార్టీలలో కూడా చర్చ మొదలైంది. మాజీ ఎమ్మెల్యేలు నేతలు ఫోన్‌లు చేస్తూ ఆరా తీస్తున్నారని తెలిసింది. మొత్తానికి నిజామాబాద్ జిల్లా నుంచి ఎంతటి సంఘీభావం కవితకు లభిస్తుందనేది చూడాలి.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>