కలం, నిర్మల్: జాతీయ ఆరోగ్య మిషన్ (NHM) పరిధిలో పనిచేస్తున్న ఉద్యోగులు (NHM Employees) తమ సమస్యలను పరిష్కరించాలని కోరుతూ బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డిని శుక్రవారం జిల్లా కేంద్రంలో కలిసి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఉద్యోగులు మాట్లాడుతూ.. తెలంగాణలో గత 20 ఏళ్లుగా ఎన్హెచ్ఎం పరిధిలో కాంట్రాక్టు, ఔట్సోర్సింగ్ ఉద్యోగులుగా సేవలందిస్తున్నామని తెలిపారు. ప్రజలకు వైద్య సేవలు అందించడంలో కీలక పాత్ర పోషిస్తున్నప్పటికీ తమ ఉద్యోగాలను క్రమబద్ధీకరించడంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు.
రాష్ట్రవ్యాప్తంగా ఎన్హెచ్ఎం ఉద్యోగులందరినీ రెగ్యులరైజ్ చేస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చినప్పటికీ ఇప్పటివరకు అమలు చేయలేదని వారు పేర్కొన్నారు. తమ న్యాయమైన డిమాండ్లను ప్రభుత్వం వెంటనే పరిష్కరించి ఉద్యోగ భద్రత కల్పించేలా చర్యలు తీసుకోవాలని ఎన్హెచ్ఎం ఉద్యోగులు కోరారు. దీనిపై స్పందించిన ఎమ్మెల్యే ఏలేటి (MLA Alleti Maheshwar Reddy) ఉద్యోగుల సమస్యలను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి, వారి న్యాయమైన డిమాండ్ల పరిష్కారానికి ప్రభుత్వంపై ఒత్తిడి తీసుకువస్తానని హామీ ఇచ్చారు.

