కలం, నిర్మల్: హైదరాబాద్‌లోని నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్స్‌లో మాజీ హర్యానా గవర్నర్ బండారు దత్తాత్రేయ సారథ్యంలో, అలయ్ బలయ్ ఫౌండేషన్ చైర్‌పర్సన్ బండారు విజయలక్ష్మి ఆధ్వర్యంలో నిర్వహించిన 20వ వార్షిక అలయ్ బలయ్ – 2026 వేడుకల్లో (Alai Balai Festival) నిర్మల్ జిల్లా బీజేపీ అధ్యక్షుడు రితేష్ రాథోడ్ (Ritesh Rathod) తెలంగాణ బీజేపీ నేతలతో కలిసి పాల్గొన్నారు.
రాజకీయాలు, కులమతాలకు అతీతంగా ప్రజల మధ్య ఐక్యత, సోదరభావం, సామాజిక సమరసతను పెంపొందించడమే అలయ్ బలయ్ వేడుకల ప్రధాన ఉద్దేశమని ఈ సందర్భంగా పేర్కొన్నారు. ‘నషా ముక్త్ భారత్’, ‘వికసిత్ భారత్’ నినాదాలతో యువతలో అవగాహన కల్పిస్తూ, సమాజంలో ఐక్యతా భావాన్ని చాటిచెప్పడం అభినందనీయమన్నారు. సాంస్కృతిక ఐక్యతను చాటిచెప్పే ఈ సమ్మేళనం ప్రజల మధ్య స్నేహభావాన్ని మరింత బలోపేతం చేసిందని పేర్కొన్నారు.

