జాతీయ స్థాయి క్రీడ‌ల్లో విద్యార్థులు రాణించాలి: కలెక్టర్ రిజ్వాన్ బాషా

కలం, జోగులాంబ గద్వాల: జిల్లా క్రీడాకారులు తాము ఎంచుకున్న క్రీడల్లో ప్రతిభ చాటి జాతీయస్థాయిలో జోగులాంబ గద్వాల ఖ్యాతిని నిలబెట్టాలని జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ (Rizwanbasha Shaik) ఆకాంక్షించారు. మానవపాడు ప్రభుత్వ జూనియర్ కళాశాల విద్యార్థిని మధుప్రియ జాతీయ స్థాయి వాలీబాల్ పోటీలకు ఎంపికైన నేపథ్యంలో గురువారం కలెక్టరేట్‌లో జిల్లా కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ శాలువాతో సన్మానించి అభినందించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ.. విద్యార్థులు చదువుతో పాటు క్రీడల్లో రాణించడం వల్ల‌ మానసికంగా, శారీరకంగా ఉల్లాసంగా ఉండవచ్చన్నారు.

క్రీడల్లో అత్యుత్తమ ప్రతిభ చాటితే యువతకు ప్రభుత్వ ఉద్యోగాల్లోనూ క్రీడా కోటాలో రిజర్వేషన్స్ కల్పించడం జరుగుతోందన్నారు. మధుప్రియ వాలీబాల్‌తో పాటు ఇటీవల జరిగిన వెయిట్ లిఫ్టింగ్ రాష్ట్రస్థాయి పోటీల్లో ద్వితీయ బహుమతి కైవసం చేసుకోవడం అభినందనీయమన్నారు. హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో జరగబోయే జాతీయస్థాయి వాలీబాల్ పోటీల్లోనూ ప్రతిభ చాటి అంతర్జాతీయ స్థాయికి ఎదగాలని సూచించారు. ఈ కార్యక్రమంలో డీఐఈఓ హృదయ రాజ్, కళాశాల ప్రిన్సిపాల్ మంజుల, స్వప్న, విద్యార్థిని తల్లిదండ్రులు నాగార్జున, సోమేశ్వరి, తదితరులు పాల్గొన్నారు.

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>