మర్రిగూడలో పండుగ సాయన్న జయంతి వేడుకలు

కలం, మునుగోడు: మర్రిగూడ (Marriguda) మండల కేంద్రంలో ముదిరాజ్ సంఘం ఆధ్వర్యంలో పండుగ సాయన్న జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా సాయన్న చిత్రపటానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. పేదల అభ్యున్నతికి సాయన్న చేసిన సేవలు చిరస్మరణీయమని సంఘం మండల నాయకుడు జింకల లింగస్వామి అన్నారు. బహుజన వర్గాల హక్కులు, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం పండుగ సాయన్న చూపిన మార్గంలో ప్రతి ఒక్కరూ నడవాలని పిలుపునిచ్చారు. నాయకులు డెంకని జానయ్య ముదిరాజ్, కుక్కల వెంకటేష్ ముదిరాజ్, జింకల రమేష్ ముదిరాజ్, కుక్కల మహేందర్ ముదిరాజ్, డెంకని రవి ముదిరాజ్, జింకల కృష్ణ ముదిరాజ్ పాల్గొన్నారు.

Also Read : భారీ ఆందోళనకు ఇండియా కూటమి రెడీ

Follow Us On : WhatsApp

మ‌రిన్ని వార్త‌ల కోసం మా వాట్స‌ప్ ఛాన‌ల్ ఫాలో అవ్వండి

లేటెస్ట్ న్యూస్‌

Read More Latest News >>

ఎక్స్‌క్లూజివ్‌

Read More Exclusive Stories >>