కలం, సోన్: దేవి శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా సోన్ మండలం కడ్తాల్ (Kadtal) గ్రామంలోని రామాలయంలో ప్రతిష్ఠించిన దుర్గామాతను మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్ దూప్ సింగ్ శుక్రవారం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయ పూజారి ఆయనకు తీర్థప్రసాదాలు అందజేసి ఆశీర్వదించారు. గ్రామస్తులంతా ఐకమత్యంతో నవరాత్రి ఉత్సవాలను ఉత్సాహంగా జరుపుకోవడం ఆనందంగా ఉందని అన్నారు. అనంతరం ఆలయంలో నిర్వహించిన అన్నదాన కార్యక్రమంలో పాల్గొన్నారు. నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా కుంకుమార్చన జరిపారు. దుర్గామాతను కరెన్సీ నోట్లతో ప్రత్యేకంగా అలంకరించారు. ఈ కార్యక్రమంలో దుర్గాదేవి ఉత్సవ కమిటీ సభ్యులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

