కలం, నిర్మల్: నిర్మల్ జిల్లా కేంద్రంలోని గాజులపేట్లో రేణుక ఎల్లమ్మ ఆలయ (Renuka Yellamma Temple) నిర్మాణానికి బీజేఎల్పీ నేత, నిర్మల్ ఎమ్మెల్యే ఏలేటి మహేశ్వర్ రెడ్డి (MLA Alleti Maheshwar Reddy) శుక్రవారం శంకుస్థాపన చేశారు. రూ.12 లక్షల వ్యయంతో ఆలయాన్ని నిర్మిస్తున్నట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ.. ప్రతి ఒక్కరూ ఆధ్యాత్మిక చింతనను అలవర్చుకోవాలని సూచించారు. దేవి శరన్నవరాత్రి ఉత్సవాలను నిర్మల్ నియోజకవర్గ ప్రజలందరూ సంతోషంగా జరుపుకోవాలని ఆకాంక్షించారు. అమ్మవారి ఆశీస్సులతో ప్రజలంతా సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ప్రార్థించారు. ఈ కార్యక్రమంలో కాలనీవాసులు, బీజేపీ నాయకులు పాల్గొన్నారు.

