కలం, వెబ్ డెస్క్: హైదరాబాద్లో బార్(Hyderabad Bars)లకు భారీ డిమాండ్ ఏర్పడింది. క్యూర్ పరిధిలో కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 14 బార్లకు ఏకంగా 4,251 దరఖాస్తులు రావడం గమనార్హం. అంటే ఒక్కో బార్కు 304 అప్లికేషన్లు వచ్చాయి. నార్సింగిలోని ది అడ్రస్ కన్వెన్షన్ హాల్లో ఎక్సైజ్ కమిషనర్ హరికిరణ్ 14 బార్లకు డ్రా తీసి.. అవి దక్కించుకున్నవారికి లైసెన్సులు అందించారు. రాష్ట్ర వ్యాప్తంగా మిగిలిన కార్పొరేషన్లు, మున్సిపాలిటీల్లోని 27 బార్లకు 4,519 దరఖాస్తులు వచ్చాయి. వీటిని ఆయా జిల్లాల కలెక్టర్ల ఆధ్వర్యంలో డ్రా తీసి అందించినట్లు కమిషనర్ నిర్వహించారు. మొత్తంగా రాష్ట్ర వ్యాప్తంగా 41 బార్లకు 8,770 దరఖాస్తులు అందాయి.
దండిగా ఆదాయం..
రాష్ట్ర వ్యాప్తంగా కొత్తగా ఏర్పాటు చేయబోతున్న 41 బార్లకు సంబంధించి దరఖాస్తుల ప్రక్రియ ద్వారానే రూ.87.71 కోట్ల ఆదాయం సమకూరింది. హైదరాబాద్ నగరాన్ని మినహాయిస్తే అశ్వారావుపేట, ములుగు, స్టేషన్ ఘన్పూర్, కల్లూరు డివిజన్లలో పోటీ భారీగా నెలకొంది. ఇక మొయినాబాద్లో రెండు బార్లకు 664 దరఖాస్తులు వచ్చాయి. రాష్ట్రంలోనే ఇవే అత్యధికం. అతి తక్కువగా నిజామాబాద్ జిల్లా బోధన్లో 19 అప్లికేషన్లు వచ్చాయి. ఇదిలా ఉంటే ఇటీవల ప్రభుత్వం విధించిన అదనపు పన్నుతో తాము తీవ్రంగా నష్టపోతామని బార్ యజమాలను గగ్గోలు పెట్టారు. కానీ వేలాది దరఖాస్తులు రావడంతో ఆశ్చర్యపోతున్నారు. ప్రతి జిల్లాలో జనాభా ఆధారంగా బార్ల సంఖ్యను ఇటీవల పెంచిన విషయం తెలిసిందే.
Also Read : విజయ డెయిరీ పాల ధరల పెంపు!
Follow Us On: Youtube

